
పూనమ్ కౌర్.. ఎప్పుడు ఎలా స్పందిస్తుందో.. ఎలా రియాక్టవుతుందో.. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు ఎలాంటి పోస్ట్‌ని షేర్ చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇటీవల జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ని ఉద్దేశిస్తూ ఓ స్టార్ చేసిన వ్యాఖ్యాల్ని తప్పుపట్టిన పూనమ్ అతనికి రెండు బెత్తం దెబ్బలు అంటూ ట్వీట్ చేసి షాకిచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా అలాంటి ట్వీట్‌నే మళ్లీ చేసి తను ఎవరిని తిడుతుందో.. ఎందుకు తిడుతుందో అర్థం కాకుండా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ 97వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించి స్వర్గీయ నందమూరి తారకరామారావుకు నివాళులర్పించింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.
ఈ వీడియోతో పాటు ఆసక్తికరమైన ఓ పోస్ట్‌ని పెట్టింది. `ఎన్.టి.ఆర్ తెలుగు ప్రజల దేవుడు. స్వర్గం నుండి నన్ను ఆశీర్వదించండి. నేను డెవిల్స్‌తో పోరాడుతున్నాను నన్ను దీవించండి. మీలాంటి నాయకులు, నటులు ఇప్పుడు అక్కడ చాలా అవసరం.. ఇక్కడ మానవత్వం లోపించింది` అని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పూనమ్ ఎవరిపై ఈ సెటైర్లు వేసిందన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.