Homeటాప్ స్టోరీస్మాల్దీవ్స్ లో పూజ రచ్చ తగ్గట్లేదుగా

మాల్దీవ్స్ లో పూజ రచ్చ తగ్గట్లేదుగా

మాల్దీవ్స్ లో పూజ రచ్చ తగ్గట్లేదుగా
మాల్దీవ్స్ లో పూజ రచ్చ తగ్గట్లేదుగా

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిన పూజ హెగ్డే వరసగా విజయవంతమైన చిత్రాల్లో భాగమవుతూ వస్తోంది. పూజ తెలుగులో నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం పూజ హెగ్డే రాధే శ్యామ్ విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఈ సినిమా జనవరి 14, 2022న విడుదల కానుంది. ఆ తర్వాతి నెల అంటే ఫిబ్రవరిలో ఆచార్య చిత్రం కూడా విడుదలవుతుంది. అందులో రామ్ చరణ్ సరసన నటించిన పూజ. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లో ఈ భామ పాల్గొనాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో పూజ హెగ్డే మాల్దీవ్స్ కు చెక్కేసింది. అక్కడ హాలిడే ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. పూజ మాల్దీవ్స్ కు వెళ్లిన దగ్గర నుండి ఆమె ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. బీచ్ సైడ్ బికినీ ఫోజుతో మొన్ననే కనువిందు చేసిన పూజ ఇప్పుడు ట్రాపికల్ లుక్ లో అదరగొట్టేసింది. కింద పలజు వేసి పైన బ్రౌన్ కలర్ బ్రాలేట్ లో పూజ గ్లామర్ అదిరిపోయింది.

- Advertisement -

నాజూకైన ఫిజిక్ ను మైంటైన్ చేయడం ఎలానో పూజ దగ్గరే నేర్చుకోవాలేమో అనేలా ఉంది. తమిళ లో విజయ్ సరసన బీస్ట్ చేస్తోన్న పూజ హెగ్డే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చిత్రానికి ఎస్ చెప్పిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All