
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ చిత్రం అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు చాలానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇటీవలే చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా, అందంగా ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం టాప్ రేంజ్ లో దూసుకుపోతోన్న పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా చేయనుంది. పవన్ కళ్యాణ్ తో పూజకు ఇది ఫస్ట్ టైమ్ కాంబినేషన్ కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మూడోది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ నుండి మొదలుపెట్టనున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ కాకుండా పూజ హెగ్డే తెలుగులో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను కూడా చేయనుంది.