Homeటాప్ స్టోరీస్మహేష్ సరసన మరోసారి నటించనున్న పూజ హెగ్డే

మహేష్ సరసన మరోసారి నటించనున్న పూజ హెగ్డే

మహేష్ సరసన మరోసారి నటించనున్న పూజ హెగ్డే
మహేష్ సరసన మరోసారి నటించనున్న పూజ హెగ్డే

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా నిన్న చాలా అప్డేట్స్ వచ్చాయి. ముందుగా సర్కారు వారి పాట టీజర్ అందరినీ ఆకర్షించింది. టీజర్ విడుదలైన మొదటి 24 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి రికార్డ్ ను క్రియేట్ చేసింది ఈ టీజర్. ఇక సాయంత్రం వచ్చిన మరో అప్డేట్ మహేష్ 28వ సినిమాకు సంబంధించింది.

సర్కారు వారి పాట పూర్తయ్యాక మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పనిచేయబోతున్నాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థ నిర్మిస్తోంది. నిన్న మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీమ్ ను ప్రకటించారు. హీరోయిన్ గా పూజ హెగ్డే పేరుని కన్ఫర్మ్ చేసారు. మహర్షి తర్వాత పూజ హెగ్డేతో పనిచేయడం మహేష్ కు ఇది రెండో సారి కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వరసగా మూడు సినిమాలు చేస్తున్నట్లు.

- Advertisement -

అరవింద సమేత, అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోంది పూజ. మధి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం దర్శకత్వం వహించనున్నాడు. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All