Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్బుట్ట‌బొమ్మ ఉదార‌త‌ను చాటుకుందిగా!

బుట్ట‌బొమ్మ ఉదార‌త‌ను చాటుకుందిగా!

బుట్ట‌బొమ్మ ఉదార‌త‌ను చాటుకుందిగా!
బుట్ట‌బొమ్మ ఉదార‌త‌ను చాటుకుందిగా!

టాలీవుడ్‌లో క్రేజీ క‌థానాయిక‌గా పేరుతెచ్చుకుంది పూజా హెగ్డే. ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో బుట్ట‌బొమ్మ‌లా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన పూజా త‌న ఖాతాలో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. వరుస ఆఫ‌ర్ల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తున్న పూజాహెగ్డే తెర‌పై గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డ‌మే కాదు తెర ముందు ఉద‌ర‌త‌ను కూడా చాటుకుంటోంది.

- Advertisement -

ఇప్ప‌టికే ఆప‌న్నుల అండ‌గా నిలుస్తూ ప్ర‌త్యూశ షౌండేష‌న్ ద్వారా స్టార్ హీరోయిన్ స‌హాయం అందిస్తుంటే తాజాగా ఆ జాబితాలో పూజా హెగ్డే కూడా చేరిపోయింది. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల స‌హాయార్థం 2.50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ గోల్ఫ్ క్ల‌బ్ లో `క్యూర్ ఫౌండేష‌న్` వారు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పూజా హెగ్డే ప్ర‌త్యేకంగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే ఆమె క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌రు విరాళాన్న‌ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ `నేను వైద్యుల కుటుంబం నుంచే వ‌చ్చాను. మా అన్న‌య్య డాక్ల‌ర్‌. స్నేహితులు కూడా వైద్య వృత్తిలోనే వున్నారు. వైద్యుడే నిజ‌మైన హీరో అని నేను భావిస్తాను. బాధిత చిన్నారుల కోసం వీలైన‌న్ని నిధులు స‌మకూర్చి పిల్ల‌ల్ని కాపాడాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుతున్నాను. ప్ర‌తీ ఒక్క‌రికీ మంచి ప‌నులు చేయాల‌ని వుంటుంద‌ని, కానీ ఎలా చేయాలో అవ‌గాహ‌న వుండ‌ద‌ని, ఇలాంటి ఆర్గ‌నైజేష‌న్‌ల ద్వారా ఆర్థిక సహాయాన్ని ప్ర‌క‌టించి అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపాల‌ని కోరుకుంటున్నాను` అన్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts