
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. పిరియమాడిక్ ఫిక్షనల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్ , టీసిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటలీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం పలు కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం చిత్ర బృందం మరోసారి ఇటలీ వెళ్లింది. అక్కడ బ్యాలెన్స్‌గా వున్న సన్నివేశాల్ని పూర్తి చేస్తున్నారు. ఈ రోజు హీరోయిన్ పూజా హెగ్డే పుట్టిన రోజు ఈ సందర్భంగా పూజా లుక్‌తో పాటు ఆమె క్యారెక్టర్ నేమ్‌ని కూడా చిత్ర బృందం రివీల్ చేశారు. ఇందులో పూజా క్యారెక్టర్ పేరు `ప్రేరణ`. పూజా పోస్టర్‌ని షేర్ చేసిన హీరో ప్రభాస్ `మా ప్రేరణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు` అంటూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.
ప్రభాస్ షేర్ చేసిన దాన్ని బట్టి `రాధేశ్యామ్` స్టోరీ `మగధీర` తరహాలో రెండు జన్మల కథా అన్నది స్పష్టమవుతోంది. తన రాధ కోసం శ్యామ్ అన్వేషణలో ప్రేరణ కనిపిస్తుందా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ని ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజుని చిత్ర బృందం విడుదల చేయబోతున్నారట.