
పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే ప్రస్తుతం టాప్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు. టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న పూజ, బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం అవకాశాలు భారీగానే అందుకుంటోంది. ఈ భామ అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. లక్షల కొద్దీ ఫాలోయర్స్ ఉన్న పూజ హెగ్డే అప్పుడప్పుడూ తన అభిమానుల కోసం గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా పూజ బ్యాక్ లెస్ ఫొటోతో అభిమానుల మతులు పోగొట్టింది. బ్యాక్ లెస్ ఫోజ్ కు తోడు ఆమె సెడక్టివ్ లుక్స్ ఫాలోయర్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ ఫోటోను పూజ హెగ్డే స్టైలిస్ట్ తాన్యా గావ్రి పోస్ట్ చేయగా పూజ హెగ్డే రీషేర్ చేసింది.
పూజ హెగ్డే ప్రస్తుతం మూడు తెలుగు సినిమాల రిలీజ్ ల కోసం ఎదురుచూస్తోంది. రాధే శ్యామ్ ను ఇటీవలే పూర్తి చేసిన ఈ భామ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, ఆచార్య చిత్రాల్లో కూడా నటించింది.