Homeగాసిప్స్రాధేశ్యామ్ కు దూరంగా పూజా హగ్దే..?

రాధేశ్యామ్ కు దూరంగా పూజా హగ్దే..?

pooja hegde hot show
pooja hegde hot show

ప్రభాస్ – పూజా హగ్దే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ మూవీ లో జోడి కట్టారు. పాన్ ఇండియన్ మూవీ గా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ గత వారం రోజులుగా పలు నగరాల్లో ప్రెస్ మీట్స్ , ఈవెంట్స్ ఏర్పటు చేస్తూ సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొస్తున్నారు. కాగా ఈరోజు సోమవారం హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ కు హీరోయిన్ పూజా రాకపోవడం అందర్నీ షాక్ లో పడేసింది. ప్రభాస్ తో పాటు నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన థమన్ ఇలా వీరంతా వచ్చి పూజా రాకపోయేసరికి మీడియా లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మూవీ మొదలైనప్పటి నుండి పూజా హగ్దే ..చిత్ర యూనిట్ తో కలివిడిగా ఉండాలేదని, కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయినప్పటికీ..ఆ తర్వాత షెడ్యూల్ సిద్దమైన కూడా పూజా డేట్స్ ఇవ్వలేదని అందుకే మేకర్స్ పూజా విషయంలో కాస్త కోపంగా ఉన్నారనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. రీసెంట్ గా జరుగుతునం సినిమా ప్రమోషన్ లలో కూడా ప్రభాస్ , పూజా లు ఇద్దరు మాట్లాడిన సన్నివేశం కానీ , ఒకరిని ఒకరు చూసుకున్న సందర్భం కూడా లేదని అంటున్నారు. ఇక ఈరోజు పూజా రాకపోయేసరికి అవన్నీ నిజమే కావొచ్చని ఫిక్స్ అవుతున్నారు. మరి పూజా రాకపోవడానికి కారణం ఏంటో ఆమెనే చెప్పాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All