
తెలుగులో వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లని తర ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే స్టార్ హీరోయిన్‌గా సౌత్‌లో మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ నటిస్తున్న `రాధేశ్యామ్`తో పాటు `ఆచార్య`లోనూ నటిస్తున్న పూజా హెగ్డే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కి జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. విజయ్ 65వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించబోతున్నారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నఈ మూవీలో విజయ్‌కి జోడీగా పూజకు సన్ పిక్చర్స్ సంస్థ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అయితే ఈ మూవీ మేకర్స్‌కి పూజా హెగ్డే తాజాగా షాకిచ్చింది. ఈ మూవీని బుశారం చెన్నైలో లాంఛనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో హీరో విజయ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొంది.
అయితే ఈ కార్యక్రమంలో పూజా హెగ్డే మాత్రం పాల్గొనలేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది పూజా హెగ్డే. `నేను వేరే చోట షూటింగ్ చేస్తున్నందు వల్ల ఈ రోజు దలపతి 65 ముహారత్ పూజలో పాల్గొనలేకపోయాను. కానీ నా హృదయం, ఆత్మ టీమ్‌తోనే ఉన్నాయి. గుడ్ లక్. త్వరలో మీతో చేరడానికి వేచివుండలేకపోతున్నాను`అని ట్వీట్ చేసింది.