Homeటాప్ స్టోరీస్ధనుష్ సినిమాలో నటించనున్న పూజ హెగ్డే

ధనుష్ సినిమాలో నటించనున్న పూజ హెగ్డే

ధనుష్ సినిమాలో నటించనున్న పూజ హెగ్డే
ధనుష్ సినిమాలో నటించనున్న పూజ హెగ్డే

తమిళ వెర్సటైల్ హీరో వరసగా తెలుగు దర్శకులతో సినిమాలకు కమిటవుతున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ సినిమా చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ చిత్రం కంటే ముందే ధనుష్ మరో డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు.

తొలిప్రేమ, రంగ్ దే వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరితో ధనుష్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో కూడా ఇప్పుడు అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా చేయనుందని టాక్.

- Advertisement -

పూజ హెగ్డే వరసగా టాప్ సినిమాలను చేజిక్కించుకుంటోంది. తమిళ్ లో బీస్ట్ చిత్రం ద్వారా పూజ హెగ్డే రీఎంట్రీ ఇస్తోంది. అన్ని ఇండస్ట్రీలలో చేతినిండా చిత్రాలతో పూజ హెగ్డే కొత్త సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టపడుతోంది. చూడాలి మరి ధనుష్ చిత్రాన్ని ఎలా మ్యానేజ్ చేస్తుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All