Homeగాసిప్స్మరోసారి ఐటెం సాంగ్ బాంబ్ గా మారబోతున్న బుట్టబొమ్మ..

మరోసారి ఐటెం సాంగ్ బాంబ్ గా మారబోతున్న బుట్టబొమ్మ..

బుట్టబొమ్మ పూజా హగ్దే పట్టిందల్లా బంగారమే అవుతుంది. డీజే మూవీ తర్వాత అమ్మడు చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి ఒక్క రాధే శ్యామ్ తప్ప. దీంతో అమ్మడిని గోల్డెన్ లెగ్ గా నిర్మాతలు భావిస్తున్నారు. తమ సినిమా లో పూజా ఆలా కనిపించిన చాలు…సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. అందుకే అమ్మడి కాల్ షీట్స్ కోసం ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఈ భామ ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఎఫ్ 3′ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్ 3’ సినిమాలో వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. తమన్నా భాటియా – మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సోనాలి చౌహన్ స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పూజా చేత దిల్ రాజు ఎఫ్ 3 లో ఐటెం సాంగ్ చేయించేందుకు సిద్ధం చేసాడని అంటున్నారు. ఈ పాట కోసం దాదాపు కోటిన్నర వరకు అడుగగా.. చివరకు మేకర్స్ రూ. 1 కోటికి బేరమాడారని ఊహాగానాలు వస్తున్నాయి. కేవలం ఒక పాట కోసం అంత రెమ్యునరేషన్ అంటే ఇది భారీ ఒప్పందమనే చెప్పాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All