
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. ఈ ఏడాది ప్రారంభంలో బన్నీతో కలిసి `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించి ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకుంది. ఆ వెంటనే పాన్ ఇండియా స్థాయిలో యువీ బ్యానర్‌పై ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `రాధేశ్యామ్`లో నటిస్తోంది. ఈ మూవీ కోసం ఏ హీరోయిన్ చేయని రిస్క్ చేసి ఔరా అనిపించింది.
కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ జార్జీయా వెళ్లి కీలక ఘట్టాల షూటింగ్‌ని ప్రభాస్‌తో కలిసి పూర్తి చేసి ఆశ్చర్యపరిచిన ఊజా హెగ్డే తాజాగా మళ్లీ అదే తరహాలో ఎగ్రెసీవ్‌గా అడుగులు వేస్తోంది. లాక్‌డౌన్ అన్ లాక్ ప్రక్రియలో భాగంగా షూటింగ్‌లు మళ్లీ ప్రారంభం అవుతున్న వేళ పూజా హెగ్డే నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మూవీ షూటింగ్ పునః ప్రారంభమైంది.
మాస్క్ ధరించకుండా తన వ్యక్తిగత సిబ్బందితో హల్చల్ చేస్తున్న పూజా హెగ్డే ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.