
అందం, అభినయంతో సంబంధం లేకుండా క్రేజ్‌ని సొంతం చేసుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. టాలీవుడ్‌లో వరుస ఆఫర్లని సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. టాలీవుడ్‌లో టాప్ హీరోలకున్న ఏకైక ఆప్షన్ పూజా హెగ్డే. క్రేజీ ప్రాజెక్ట్‌లని దక్కించుకుంటున్న ఆమె ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న`రాధేశ్యామ్` చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది.
ఈ సినిమాతో పాటు యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రం చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. ఇదిలా వుంటే మరి కొన్ని చిత్రాలు పూజా కోసం చర్చల దశలో వున్నాయి. కాగా హైదరాబాద్‌కు తన మకాం మార్చాలని పూజా ప్లాన్ చేస్తోంది.
ఇక్కడే మకాం పెట్టేసి తెలుగు, తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టబోతోందట. ఇందు కోసం హైదరాబాద్‌లో ఓ లగ్జరీ ఫ్లాట్‌ని తీసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా తరువాత కూడా పారితోషికం భారీగానే పెంచేసిన పూజా హేగ్డేని తెలుగు, తమిళ నిర్మాతలు భరిస్తారా? ఆమె ప్లాన్ వర్కవుట్ అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే.