Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్“బుట్ట బొమ్మ”ను ఫైనల్ చేసిన “బాలీవుడ్ భాయ్”

“బుట్ట బొమ్మ”ను ఫైనల్ చేసిన “బాలీవుడ్ భాయ్”

Pooja Hegde as a heroine with Salman khan
Pooja Hegde as a heroine with Salman khan

సినిమాలు,హిట్లు,ఫ్లాపులతో సంబంధం లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ లో “సల్మాన్ ఖాన్” ది ఒక ప్రత్యేకమైన స్థానం. గతంలో ఆయనపై ఉన్న కేసులు, ఆయన కోపం ఐశ్వర్యా రాయ్ తో గొడవలు ఇవన్నీ జనాలకు గుర్తు ఉన్నా కూడా, ముక్కుసూటి తనం,భోలా తనం, మాట ఇస్తే నిలబెట్టుకునే మంచితనం, జాలి ఇవన్నీ చూసి, అటు ఫాన్స్, ఇటు ఆడియెన్స్ సల్మాన్ ను “బాలీవుడ్ భాయ్” అంటారు.

- Advertisement -

ఇప్పుడు సల్మాన్ తన తరువాత సినిమాగా “రాధే” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది “ఈద్” పండుగ రోజు రిలీజ్ అవుతుందని ఒక అంచనా. ఇక సల్మాన్ తన తరువాతి సినిమాను కూడా ఇప్పటికే ఫైనల్ చేసారు. తనతో “కిక్” సినిమా చేసిన “నాదియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్” సంస్థ తరపున సాజిద్ నాదియాడ్ వాలా ఈ సినిమాను నిర్మించడంతోపాటు కథ కూడా అందిస్తున్నారు. ఈ సినిమాకు “కభీ ఈద్, కభీ దివాలీ” అనే పేరు ఖరారు చేసారు.

ఇటీవలే విడుదలై విజయం సాధించిన హౌస్ ఫుల్ 4 సినిమా డైరెక్టర్ ఫర్హాద్ సామ్జీ ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేస్తున్నారు. ఇక ఈసినిమాలో పూజా హేగ్దే ను హీరోయిన్ గా ఫైనల్ చేసారు. పూజ ఇప్పటికే ఫర్హాద్ డైరెక్ట్ చేసిన హౌస్ ఫుల్ 4 సినిమాలో నటించింది. ఇక ఇప్పటికే అల…. వైకుంఠపురం సినిమా సక్సెస్ తరువాత పూజా గ్రాఫ్ మారిపోయింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన “జాన్” సినిమాతోపాటు, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్” సినిమాలో నటిస్తోంది. ఇక సల్మాన్ సినిమా పూజ కు గోల్డెన్ ఛాన్స్ అని బాలీవుడ్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఐశ్వర్యా రాయ్ నుండి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వరకూ సల్మాన్ తో చేసిన అందరు హీరోయిన్స్ మోస్ట్ సక్సెస్ అయ్యారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts