HomePolitical Newsరాజకీయం గుంటూరు మిర్చిని మించి ఘాటెక్కిస్తోంది

రాజకీయం గుంటూరు మిర్చిని మించి ఘాటెక్కిస్తోంది

రాజకీయం గుంటూరు మిర్చిని మించి ఘాటెక్కిస్తోంది
రాజకీయం గుంటూరు మిర్చిని మించి ఘాటెక్కిస్తోంది

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరోసారి గరంగరంగా మారింది. గుంటూరు మిర్చిని మించి ఘాటెక్కిస్తోంది. 22 గ్రామాలతో కలిపి అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాజధాని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బోరుపాలెం గ్రామస్తులు మున్సిపాలిటీ వద్దు రాజధానే ముద్దు అంటూ తెగేసి చెప్పారు. సీఆర్డీఏ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 29 గ్రామాలతో కూడిన రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు రాజధాని రైతుల మహా పాదయాత్ర రెండో రోజు కొనసాగింది. మంగళగిరిలో ప్రారంభమైన పాదయాత్రకు బీజేపీ, సీపీఐ నేతలు సంఘీభావం ప్రకటించారు.

ఈ పాదయాత్రలో పాల్గొంటున్న రైతులకు, మహిళలకు గుర్తింపు కార్డులు జారీ చెయ్యాలని పోలీసులు నిర్ణయించారు. రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు మండిపడ్డారు. దేవుడి పేరుతో దెయ్యాల యాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. ఇది పాదయాత్ర కాదు ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటూ నేతలు, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిని ధ్వంసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని రాజధాని గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు వివిధ రూపాల్లో ప్రభుత్వం నిర్ణయాలను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

రాజధాని అమరావతికి మద్దతుగా గతంలో నిర్వహించిన అమరావతి నుంచి తిరుమల పాదయాత్ర విజయవంతం కావడంతో ఈ నెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లికి పాదయయాత్ర – 2 నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు అమరావతి రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణంలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్‌, విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది. 11 వందల ఎకరాల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, 169.27 ఎకరాలకు సంబంధించి అరెస్టులు జరిగాయని సమాచారం. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బంధువులపై ఆరోపణలు వచ్చాయి. రైతుల పాదయాత్ర, వైసీపీ నేతలు ఎదురుదాడి, మున్సిపాలిటీ బిల్లు, భూముల కుంభకోణం వ్యవహారంతో అమరావతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All