Homeటాప్ స్టోరీస్కమెడియన్ కోసం పోలీసుల వేట

కమెడియన్ కోసం పోలీసుల వేట

police searching for comedian haribabu, పలు టివి సీరియల్ లలో నటించిన కమెడియన్ హరిబాబు కోసం పోలీసులు వేట ముమ్మరం చేసారు . బుల్లితెర పై పలు సీరియల్ లలో నటించి హరిబాబు స్టేజి షోలతో కూడా పాపులారిటీ సంపాదించాడు . అయితే చిన్న చిన్న వేషాలు వేసుకునే హరిబాబు ని పోలీసులు ఎందుకు వేటాడుతున్నారని అనుకుంటున్నారా ? ఎర్రచందనం కేసులో . ఎర్రచందనం ని అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదించాడట హరిబాబు అంతేకాదు కొన్ని సినిమాలకు కూడా ఫైనాన్స్ చేసాడట .

ఇక ఇటీవలే షకలక శంకర్ హీరోగా నటించిన ” శంభో శంకర ” చిత్రానికి కూడా హరిబాబు ఫైనాన్స్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు . దానికి తగ్గట్లుగా ఆ సినిమా లో కొద్దిసేపు కనిపించాడు కూడా దాంతో అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు . తన కోసం పోలీసులు వెదుకుతున్నారని తెలియడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు హరిబాబు . ఎర్రచందనం స్మగ్లర్ గా భావిస్తున్న హరిబాబు కోసం పది బృందాలను ఏర్పాటు చేసారు పోలీసులు .

- Advertisement -

English Title: police searching for comedian haribabu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All