Homeటాప్ స్టోరీస్రాధికా శరత్ కుమార్ “పిన్ని- 2” వస్తోంది

రాధికా శరత్ కుమార్ “పిన్ని- 2” వస్తోంది

రాధికా శరత్ కుమార్ “పిన్ని- 2” వస్తోంది
రాధికా శరత్ కుమార్ “పిన్ని- 2” వస్తోంది

హీరోయిన్ పేరు శక్తి. హీరో పేరు రాము. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ శుభలేఖ సుధాకర్ గారు. ఇక హీరో రాముని ప్రేమించి అతను దక్కక, అతని జీవితం నాశనం చేయాలని అతని స్నేహితుడు శుభలేఖ సుధాకర్ ని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకొని, మద్యానికి బానిస గా మార్చిన లేడి విలన్ ప్రభావతి. ఇక హీరోయిన్ రాధికకు ఎప్పుడూ చేదోడువాదోడుగా ఉండే ఫ్రెండ్ అజయ్ రత్నం.. క్యారెక్టర్ పేరు యోగి.

ఇక కూతురు కావేరి. ఆమెను ప్రేమించి మోసం చేసే లవర్ డ్యానియల్. హీరో రాము అక్క కూతురు విజ్జి. ఆమెను గుడ్డిగా ప్రేమించి మోసపోయే మెకానిక్ వాసు…. ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. కథలో మంచి పీక్ కి వెళ్ళాక…. హీరోయిన్ రాధిక ఒకరు కాదు. ఇద్దరు అని ట్విస్ట్. మళ్ళీ హీరో రాము మొదటి భార్య బ్రతికే ఉండటం.

- Advertisement -

ఇక ఎక్కడో శ్రీరంగంలో మొదలైన కథ చెన్నైకి చేరుతుంది. అదే తెలుగు డబ్బింగ్ లో మాట్లాడుకోవాలి అంటే వైజాగ్ వచ్చేస్తుంది. అక్కడ వాళ్ళు మొట్టమొదట పెట్టే ఇండస్ట్రీ “కావేరీ గార్మెంట్స్”. కావేరీ క్యారెక్టర్ చేసిన నటి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారి భార్య అయిన వాసుకి.

ఇక ఆ రోజుల్లో సాయంత్రం 7:30 అయిందంటే చాలు ప్రతి ఇంటి నుండి “కృష్ణమ్మకు గోదారికి తోడు ఎవరమ్మా..! మమతల మందాకిని మగువే నమ్మ..” అనే పాట రీసౌండ్ లో వినిపిస్తూ ఉండేది. ఇక ఆ రోజుల్లో సర్వసాధారణమైన కరెంటు కోతలు సమయంలో కూడా అరుగుల మీద ఆడవాళ్లు కూర్చుని మాట్లాడుకునేది ఈ సీరియల్ గురించే. ఇక ఇప్పుడు ఆ సీరియల్ పిన్ని మళ్లీ రెండో పార్ట్ మొదలవబోతోంది. మొదటి పాటలో టైటిల్ క్యారెక్టర్ చేసిన రాధిక ఈ సీరియల్లో కూడా ఫుల్ లెన్త్ పాత్రలో కనబడుతున్నారు.

ఇక కథ కూడా అలాగే అనిపిస్తోంది. గతంలో ఇలాంటి సెంటిమెంట్ సీరియల్స్ మోతాదు ఎక్కువై ప్రజలలో భావోద్వేగాలు శాతం ఎక్కువైన నేపథ్యంలో ప్రతి ఆదివారం అమృతం సీరియల్ వచ్చేది. వచ్చిన ఆ సీరియల్ పెద్ద హిట్ అయింది. తర్వాత ఆగిపోయింది. ఇప్పుడు డిజిటల్ వేదికపై అమృతం సీరియల్ రెండో పార్ట్ మొదలైంది. దరిమిలా ఇప్పుడు ఈ సెంటిమెంట్ సీరియల్ అయిన “పిన్ని2” మళ్ళీ జెమిని ఛానల్ లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది.

ఇక సెల్ ఫోన్లు ఎక్కువగా పెరిగిన తరువాత కూడా ఆ రోజుల్లో సూపర్ హిట్ అయిన సీరియల్స్ డిజిటల్ మీడియాలో కూడా పాత ఎపిసోడ్స్ అప్లోడ్ చేసి ఫిట్స్ సంపాదిస్తున్నారు.కాబట్టి వీటికి ఆదరణ తగ్గలేదు అని నిరూపించబడింది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All