Homeటాప్ స్టోరీస్ఫొటో స్టోరీ: ఫ‌స్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు కానీ..

ఫొటో స్టోరీ: ఫ‌స్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు కానీ..

ఫొటో స్టోరీ: ఫ‌స్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు కానీ..
ఫొటో స్టోరీ: ఫ‌స్ట్ ఫిల్మ్ రిలీజ్ కాలేదు కానీ..

కేతిక శ‌ర్మ‌.. టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం హాట్ ఫేవ‌రేట్‌. ఢిల్లీకి చెందిన ఈ హాటెస్ట్ మోడ‌ల్ డ‌బష్మాష్ వీడియోల‌తో యూట్యూబ్‌లో పాపుల‌ర్ అయిపోయింది. మోడ‌ల్‌గా సింగ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 24 ఏళ్ల ఈ హాట్ ఆటంబాంబ్ `రొమాంటిక్‌` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచ‌య‌మ‌వుతోంది. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ఫ‌స్ట్ ఫిల్మ్ రిలీజ్ కాకుండానే టాలీవుడ్‌లో త‌న హాట్ షోతో కేతిక సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలుస్తోంది. `రొమాంటిక్‌` చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌, ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌లో కేతిక రెచ్చిపోయి ఆకాష్‌తో లిప్‌లాక్ చేసిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటున్నాయి. తొలి సినిమాకే ఈ రేంజ్‌లో రెచ్చిపోతే ఆ త‌రువాత కేతిక శ‌ర్మ ర‌చ్చని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.

- Advertisement -

`రొమాంటిక్ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాట‌ల్ని రిటీజ్ చేశారు. మంచి స్పంద‌న ల‌భించింది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేయాల‌ని కేతిక శ‌ర్మ ఫిక్స్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. సినిమాలో చాలా బోల్డ్ సీన్‌ల‌లో ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌కుండా కేతిక న‌టించింద‌ట‌. ఇటీవ‌ల హోలీ సంద‌ర్భంగా కేతిక సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసిన ఫోటోలే ఇందుకు అద్దంప‌డుతున్నాయి. మేలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం ఆమెకు మంచి బ్రేక్‌ని అందించ‌డం ఖాయం అని అంతా అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All