Homeటాప్ స్టోరీస్పెంగ్విన్ మూవీ రివ్యూ

పెంగ్విన్ మూవీ రివ్యూ

పెంగ్విన్ మూవీ రివ్యూ
పెంగ్విన్ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ : పెంగ్విన్

నటీనటులు : కీర్తి సురేష్, లింగా, రంగరాజ్ తదితరులు

- Advertisement -

సంగీతం : సంతోష్ నారాయణన్

దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్

నిర్మాత : కార్తీక్ సుబ్బరాజ్

లాక్ డౌన్ వల్ల పలు సినిమాలు ఓటిటి వైపు చూస్తున్నాయి. అలాంటి సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పెంగ్విన్ చిత్రం గురించే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నడిచే సినిమా కావడంతో అందరికీ దీనిపై ఆసక్తి కలిగింది. పైగా తమిళంలో పేరున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా మారి చేసిన ప్రయత్నమవ్వడంతో అందరూ ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. పైగా ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈరోజు ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన పెంగ్విన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

రిథమ్ (కీర్తి సురేష్).. రెండేళ్ల కొడుకు తప్పిపోతాడు. ఆమె ఎంతలా వెతికినా ఫలితం కనిపించదు. ఏడాది గడిచినా కూడా ఆమె అన్వేషణ కొనసాగుతుంది. ఆమె భర్త రఘు (లింగా) కూడా తన ప్రవర్తనతో విసిగిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత తనను బాగా అర్ధం చేసుకున్న గౌతమ్ (రంగరాజ్)ను రిథమ్ పెళ్లి చేసుకుంటుంది. తన కొడుకు తప్పిపోయి ఆరేళ్ళు గడిచిన తర్వాత కూడా తనను వెతుకుతూనే ఉంటుంది. ఈలోగా ఆమె గర్భవతి అయ్యి ప్రసవం కోసం ఎదురుచూస్తుంటుంది.

ఈ నేపథ్యంలో రిథమ్ ఎదుర్కునే సవాళ్లు ఏంటి? తన కొడుకు దొరుకుతాడా? ఈ సంఘటనకు ఊళ్ళో జరుగుతున్న అకృత్యాలకు సంబంధం ఏంటి? ట్రైలర్ లో చూపించిన చార్లీ చాప్లిన్ మాస్క్ వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో దొరుకుతాయి.

నటీనటులు :

మహానటి తర్వాత కీర్తి సురేష్ మరో విమెన్ సెంట్రిక్ పాత్రను ఎంచుకుంది. రిథమ్ పాత్రలో ఉన్న స్ట్రగుల్ ను కీర్తి పెర్ఫెక్ట్ గా ఎమోట్ చేయగలిగింది. సినిమాను తన భుజాలపై మోయడానికి శతవిధాలా ప్రయత్నించింది. కొన్ని సన్నివేశాల్లో కీర్తి నటన హృద్యంగా అనిపిస్తుంది. డాక్టర్ పాత్ర చేసిన అతను ఆకట్టుకుంటాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ మాములే.

సాంకేతిక వర్గం :

సాంకేతికంగా ఈ చిత్రం అద్భుతంగా అనిపిస్తుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాల్లో తన బ్యాక్ గ్రౌండ్ వర్క్ తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇక విజువల్స్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పవచ్చు. ఎడిటర్ కూడా తన పని తనంతో మెప్పించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఇక రచయిత, దర్సకత్వం ఈశ్వర్ కార్తీక్ విషయానికొస్తే థ్రిల్లర్ కథను రాసుకోవడంలో సక్సెస్ అయినా ఇలాంటి జోనర్ కు అతి కీలకమైన ట్విస్ట్ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సీరియల్ కిల్లర్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనేది పాయింట్ లెస్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే అదిరిపోయేది.

చివరిగా :

డీసెంట్ అంచనాలతో వచ్చిన పెంగ్విన్ చిత్రం ఓ మోస్తరుగానే ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ సస్పెన్స్ మైంటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కానీ ఇలాంటి సినిమాలకు కీలకమైన సీరియల్ కిల్లర్ మోటివ్ అస్సలు సహజంగా అనిపించదు. పైగా దీనికోసమా ఇంత బిల్డప్ అన్న భావన వస్తుంది. దీంతో పెంగ్విన్ కొంత మేర మాత్రమే ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్‌: 2.5/5

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All