Homeటాప్ స్టోరీస్ఆర్ఆర్ఆర్ నిర్మాతకు షాక్ ఇచ్చిన పెన్ స్టూడియోస్

ఆర్ఆర్ఆర్ నిర్మాతకు షాక్ ఇచ్చిన పెన్ స్టూడియోస్

pen studios shock to RRR Makers
pen studios shock to RRR Makers

యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “ఆర్‌ఆర్‌ఆర్‌”. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో హిందీ వెర్షన్ రిలీజ్ చేయాల్సిన పెన్ స్టూడియోస్ వారు మేకర్స్ కు షాక్ ఇచ్చారు. హిందీ వెర్షన్ ను రిలీజ్ చేస్తామని రైట్స్ తీసుకున్న వారు ఇప్పుడు రిలీజ్ చేయలేమని చెప్పడం తో..మేకర్స్ ఓన్ గా హిందీ లో రిలీజ్ చేయబోతున్నారట. సడెన్ గా పెన్ స్టూడియోస్ వారు తప్పుకోవడానికి కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మూవీని అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు రూ 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలివియా మోరీస్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 14 భాషలలో ‘ఆర్ఆర్ఆర్’ భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All