Homeటాప్ స్టోరీస్వేశ్య పాత్రలో పాయల్ రాజ్ పుత్

వేశ్య పాత్రలో పాయల్ రాజ్ పుత్

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించిన బోల్డ్ భామ పాయల్ రాజ్ పుత్ తాజాగా వేశ్య పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఓ బయోపిక్ లో పాయల్ వేశ్యగా నటించనుంది . ఇటీవలే సీత చిత్రంలో బుల్ రెడ్డి అంటూ ఐటెం సాంగ్ తో కుర్రాళ్ళని కవ్వించిన పాయల్ ఈసారి ఏకంగా వేశ్య పాత్రలో జీవించి మరింత సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతోంది .

ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . ప్రస్తుతం సీనియర్ హీరోలైన వెంకటేష్ , రవితేజ సరసన వెంకీ మామా , డిస్కో రాజా చిత్రాల్లో నటిస్తోంది . అలాగే ఆర్డీఎక్స్ లవ్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది . ఆ సినిమాల తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగ్వేశ్వర్ రావు బయోపిక్ లో వేశ్యగా నటించనుంది పాయల్ రాజ్ పుత్ . వేశ్య పాత్ర కావడంతో కొంతమంది వేశ్యల జీవితాల గురించి తెలుసుకుంటోందట పాత్ర ఔచిత్యం కోసం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All