
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికి 30 రోజులు పూర్తి కావడంతో అంతా మే 7 కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే నిత్యం వరుస షూటింగ్‌లతో బిజీగా గడిపే స్టార్లు ఇప్పుడు పనిలేక ఇంటికే పరిమితమయ్యారు. అయితేనేం ఖాలీగా ఏమాత్రం వుండటం లేదు. నిత్యం ఏదో ఒక వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఫొటోలతో పిచ్చెక్కిస్తున్నారు. `ఆర్ ఎక్స్ 100` భామ పాయల్ రాజ్‌పుత్ కూడా నిత్యం సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్‌ని ఆకట్టుకుంటోంది. వరుస ఫొటోలతో హుషారెత్తిస్తోంది. ఈ క్వారెంటైన్ టైమ్ తనకు బోర్ కొడుతోందని ఓ సందర్భంలో భావోద్వేగానికి గురైన పాయల్ ఆ తరువాత నుంచి చిత్ర విచిత్రమైన ఫొటోలతో ఆకట్టు కోవడం మొదలుపెట్టింది.
ఒంటిపై బట్టలు లేకుండా ఎల్లో పిల్లోనే డ్రెస్‌గా మార్చుకుని సరకొత్త డ్రెస్ డిజైన్ ఛాలెంజ్ అంటూ షాకిచ్చింది. తాజాగా మరో అడుగు ముందుకేసి ఎల్లో పిల్లో ప్లేస్‌లో పేపర్ డ్రెస్‌ని డిజైన్ చేయించుకుని మళ్లీ షాకిస్తోంది. పాయల్ ఎలా వుంది నా డ్రెస్ అంటూ నెటిజన్స్‌ని ప్రశ్నిస్తోంది. పేపర్ డ్రెస్ వెనకాల బ్లాక్ కలర్‌లో పాయల్ వేసుకున్న సెఫ్టీ డ్రెస్ కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్‌లు పెడుతున్నారు.
View this post on Instagram
How’s my new outfit ?? Make every outfit count ? #madewithstyle . P.c and styling @theessdee ?
Credit: Instagram