Homeటాప్ స్టోరీస్బాలయ్య సినిమాపై పాయల్ క్లారిటీ

బాలయ్య సినిమాపై పాయల్ క్లారిటీ

బాలయ్య సినిమాపై పాయల్ క్లారిటీ
బాలయ్య సినిమాపై పాయల్ క్లారిటీ

సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా హీరోల డైరెక్టర్ల డామినేషన్ కొన్నిసార్లు ఇతర ఆర్టిస్టులను టెక్నీషియన్లను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. సినిమా కథకు ఎలాంటి నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అవసరం అవుతారో..! అన్న విషయాన్ని ఎక్కువశాతం దర్శకుడి స్వేచ్ఛకు వదిలేయాలన్న విషయాన్ని చాలామంది ఇక్కడ పట్టించుకోరు. మన కథకు “ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది; ఈ టెక్నీషియన్ అయితే బాగుంటుంది; వీళ్ళతో ట్రై చేయండి..!” అన్న విషయాన్ని తామే దర్శకుడికి చెప్తామని ఇంటర్వ్యూలలో చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు హీరోల, నిర్మాతల, ఫైనాన్షియర్ల లేదా ఇతర డెసిషన్ తీసుకునే వ్యక్తుల జడ్జిమెంట్ గనక వర్కవుట్ అయ్యి ఆ సినిమా హిట్ అయితే అంతా మంచిదే. కాని పొరపాటున వారి అభిప్రాయానికి విలువ ఇచ్చి తీసుకున్న నటీనటులు సాంకేతిక నిపుణుల పని వల్ల ఆ సినిమాకు అనుకున్న మేరకు తెరపై ఫలితంగానీ, ప్రేక్షకుల ఆదరణ గాని కనబడని పక్షంలో ఆ ఫలితాన్ని మొత్తం దర్శకుడే మోయాల్సి ఉంటుంది.

ఇటీవల ఒక పెద్ద హీరో సినిమాలో కూడా ఒక పెద్ద హీరోయిన్ ను తీసుకున్నామని చెప్పి వార్తలు వచ్చాయి. తీరా చూస్తే ఆ హీరోయిన్ కు అధికారికంగా కొంత అడ్వాన్సు ఇచ్చి డేట్లు కూడా తీసుకున్నట్లు రూఢీ అయింది. కానీ సినిమా మొదలైంది, షూటింగ్ జరుగుతోంది, హీరోయిన్ కి షూటింగ్ కి హాజరయ్యే కబురు మాత్రం రావట్లేదు. ఒక పక్క ఆమె డేట్లు వృథా అయిపోతుంటాయి. మరొక పక్క ఈ సినిమా అయ్యేవరకు ఇంకొక సినిమా ఒప్పుకో కూడదు అని కండీషన్ కూడా ఉంటుంది. అలాంటి పక్షంలో ఆ హీరోయిన్ చేసేది ఏమీ లేక, తనకు తనే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి, బ్లేమ్ కావలసి ఉంటుంది.

- Advertisement -

కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇలాంటి పుకార్లు వచ్చిన మొదటి ఫస్ట్ లెవెల్ లోనే తమ నుంచి క్లారిటీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా అదే చేసింది. తాను బాలయ్య బాబు సినిమాలో తో నటిస్తునానన్న వార్తల్లో నిజం లేదని.. ఇప్పటివరకు తనను ఎవరు బాలకృష్ణ గారి సినిమాకు సంప్రదించలేదని, ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని… తననుంచి క్లారిటీ ఇస్తున్నానని సోషల్ మీడియా లో అప్ డేట్ ఇచ్చింది. ఏదిఏమైనా… ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు కూడా తెలిపింది ఈ ఆర్ఎక్స్ 100 బ్యూటీ.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All