Homeటాప్ స్టోరీస్అఫీషియ‌ల్‌: `వ‌కీల్ సాబ్` లుక్ కిర్రాక్‌గా వుందిగా!

అఫీషియ‌ల్‌: `వ‌కీల్ సాబ్` లుక్ కిర్రాక్‌గా వుందిగా!

అఫీషియ‌ల్‌: `వ‌కీల్ సాబ్` లుక్ కిర్రాక్‌గా వుందిగా!
అఫీషియ‌ల్‌: `వ‌కీల్ సాబ్` లుక్ కిర్రాక్‌గా వుందిగా!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రెండేళ్ల విరామం త‌రువాత బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` రీమేక్‌తో మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజుతో క‌లిసి బాలీవుడ్ నిర్మాత బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ సినిమాలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌వర్‌ఫుల్ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రానికి లాయ‌ర్ సాబ్‌, వ‌కీల్ సాబ్ అనే పేర్లు ప్ర‌చారంలో వున్నాయి. చిత్ర వ‌ర్గాలు ఇటీవ‌ల ఈ రెండు టైటిల్స్‌లో `వ‌కీల్ సాబ్‌` అనే టైటిల్‌ని రిజిస్ట‌ర్ చేయ‌డంతో ఇదే టైటిల్‌ని అఫీషియ‌ల్‌గా చిత్ర బృందం ఎన్నుడెప్పుడు ప్ర‌క‌టిస్తుందా? అని ప‌వ‌న్ ఫ్యాన్స్ చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. సోమ‌వారం సాయంత్రం 5గంట‌ల‌కు చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్ర‌క‌టించ‌డంతో ఉద‌యం నుంచి సోష‌ల్ మీడియా ప‌వ‌న్ ఫ‌స్ట్ లుక్ కోసం హోరెత్తిపోతోంది.

- Advertisement -

చాలా ఈగ‌ర్‌గా ఎదురుచూసిన స‌మ‌యం రానే వ‌చ్చింది. ప‌వ‌న్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్‌ని `వ‌కీల్ సాబ్‌`గా క‌న్ఫ‌ర్మ్ చేస్తూ చిత్ర బృందం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. క‌ళ్ల‌కి బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని చేతిలో బుక్ ప‌ట్టుకుని బోర్లించిన కుర్చీపై ప‌వ‌న్ కాళ్లు పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. సినిమా మ‌రింత స్టైలిష్‌గా వుండే అవ‌కాశం వుంద‌న్న సంకేతాల్ని అందిస్తోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All