
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మెగా ప్రాజెక్ట్‌లలో కీలక అతిథి పాత్రల్లో మెరవనున్నారంటూ గత కొంత కాలంగా వరుస రూమర్స్ వినిపిస్తూనే వున్నాయి. అయితే వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలడంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. చిత్రలహరి, ప్రతిరోజు పండగే వంటి చిత్రాలతో సాయిధరమ్‌తేజ్ మళ్లీ సక్సెస్‌ల బాట పట్టారు.
ఈ ఉత్సాహంతో ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ వరుసగా సినిమాల్ని అంగీకరిస్తూ స్పీడు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేవా కట్టా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. కొత్త నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారు.
ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారట. కాగా ఇందులోని ఓ పవర్‌ఫుల్ అతిధి పాత్రలో పవన్‌కల్యాణ్ కనిపించబోతున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. దేవా కట్టా `ప్రస్థానం` తరువాత ఆ స్థాయి చిత్రాన్ని అందించలేకపోయారు. దీంతో కసిగా ఈ సినిమాతో హిట్ ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో వున్నారట. ఇందు కోసం పవన్‌ని గెస్ట్ రోల్‌లో నటించమని దర్శకుడుసంప్రదించారని, పవన్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని చిత్ర వర్గాల సమాచారం.