Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్ ఫ్యామిలీ నుండి మ‌హేష్‌, న‌మ్ర‌తకు స‌ర్‌ప్రైజ్‌‌!

ప‌వ‌న్ ఫ్యామిలీ నుండి మ‌హేష్‌, న‌మ్ర‌తకు స‌ర్‌ప్రైజ్‌‌!

ప‌వ‌న్ ఫ్యామిలీ నుండి మ‌హేష్‌, న‌మ్ర‌తకు స‌ర్‌ప్రైజ్‌‌!
ప‌వ‌న్ ఫ్యామిలీ నుండి మ‌హేష్‌, న‌మ్ర‌తకు స‌ర్‌ప్రైజ్‌‌!

టాలీవుడ్‌లో ఇటీవ‌ల స్టార్స్ త‌మ మ‌ధ్య వున్న అనుబంధాన్ని తెలియ‌జేయ‌డం కోసం ప్ర‌త్యేక అకేష‌న్‌ల‌ని వేదిక‌లుగా చేసుకుంటున్నారు. ప్రత్యేక సందర్భాలలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఒకరికొకరు స్పెష‌ల్ గిఫ్ట్ ల‌ని   పంపించుకుంటూ త‌మ మ‌ధ్య వున్న అనుబంధాన్ని జ‌నాల‌కి గుర్తు చేస్తుంటారు. ఇటీవ‌ల  ముందు దీపావళి సంద‌ర్భంగా చాలా మంది టాలీవుడ్ సెల‌బ్రిటీల కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్ర‌త్యేక బ‌హుమ‌తుల్ని పంపించి త‌మ ఆనందాన్ని అంద‌రితో షేర్ చేసుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఆ గిఫ్ట్‌ల‌ని అందుకున్న వారు ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. బ‌న్నీ కోసం రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న బ్రాండ్ కాస్ట్యూమ్స్‌ని ఇటీవ‌ల ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించి బ‌హుమ‌తిగా అందించ‌డం.. ఆ డ్రెస్‌ని వేసుకుని బ‌న్నీ సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని అభినందించ‌డం తెలిసిందే.

తాజాగా మహేష్, న‌మ్ర‌తకు అలాంటి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ అందింది. ఆ గిఫ్ట్‌ని పంపించింది మ‌రెవ‌రో కాదు   పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.  పవన్ కళ్యాణ్ ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా ప్ర‌త్యేకంగా మహేష్, నమ్రతలకు  క్రిస్మస్ గూడీ హాంపర్ల‌ని పంపించారు. ఈ విషయాన్ని న‌మ్ర‌త‌ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.  క్రిస్మస్ గూడీలో చాక్లెట్లుతో వున్న ఓ బాక్స్‌. ఓ లెట‌ర్ వుంది. అందులో `మీ గురించి హృదయపూర్వకంగా ఆలోచిస్తూ ఈ పవిత్ర మాసంలో జ‌రిగే అద్భుతాల ద్వారా మీరు ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు! అన్నా, కళ్యాణ్` అని రాసి వుంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts