
మెగాస్టార్, పవర్‌స్టార్ మునుపెన్నడూ లూని విధంగా సినిమాల విషయంలో స్పీడు పెంచారు. తమ్ముడు పవన్‌కల్యాణ్ ఇప్పటికే వరుసగా నాలుగు చిత్రాలని లైన్‌లో పెట్టారు. అందులో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో వున్నాయి. మరో రెండు చిత్రాలు త్వరలో సెట్స్‌పైకి రాబోతున్నాయి. ఇదిలా వుంటే తమ్ముడి తరహాలోనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా స్పీడు పెంచారు. `సైరా` ఫలితంతో కాస్త బ్రేక్ తీసుకుంటారని అంతా భావిస్తున్న వేళ మెగాస్టార్ చిరంజీ `ఆచార్య` మూవీ చేస్తూనే మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
అందులో ఒకటి మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా తెరపైకి రానున్న చిత్రం ఒకటి కాగా మరొకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంత వరకు దీనిపై ఎవరూ స్పష్టత నివ్వలేదు. తాజాగా ఈ వార్తలపై పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
పవన్‌కల్యాణ్ బర్త్‌డే ఈ నెల 2న జరిగిన విషయం తెలిసిందే. బర్త్‌డే విషెస్‌తో సెలబ్రిటీలతో పాటు ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా ట్విట్టర్‌ని మోతెక్కించారు. ఈ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ కూడా పవన్‌ని విష్ చేశారు. దానికి రిప్లై ఇచ్చిన పవన్ మెగాస్టార్‌తో చేయబోతున్న చిత్రానికి బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ పుకారు కాదని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మెగా ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోందని స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారని ఇన్ సైడ్ టాక్.