Homeగాసిప్స్క్రిష్ సినిమాకు కూడా పవన్ లుక్ అదేనా?

క్రిష్ సినిమాకు కూడా పవన్ లుక్ అదేనా?

క్రిష్ సినిమాకు కూడా పవన్ లుక్ అదేనా?
క్రిష్ సినిమాకు కూడా పవన్ లుక్ అదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ అయితే ఇచ్చాడు కానీ తన లుక్స్ ను పెద్దగా మార్చట్లేదు. ఈ నెల గత వారం పింక్ రీమేక్ షూటింగ్ ను మొదలుపెట్టాడు. అప్పటినుండి బ్రేక్స్ లేకుండా మధ్యాహ్నం వరకూ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే నిన్న పవన్ మరో సినిమాను కూడా స్టార్ట్ చేసేసాడు. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మించనున్న పీరియాడిక్ చిత్రాన్ని నిన్న లాంఛనంగా మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 4 నుండి మొదలుకానున్నట్లు తెలుస్తోంది. పింక్ రీమేక్, క్రిష్ చిత్రం ఈ రెండిటినీ సమాంతరంగా షూట్ చేస్తారట. పింక్ రీమేక్ కు ఇచ్చింది నెల రోజుల డేట్స్ మాత్రమే కాబట్టి అది అయిపోయాక పూర్తిగా క్రిష్ సినిమా మీదే దృష్టి సారిస్తాడని తెలుస్తోంది. క్రిష్ చిత్రాన్ని వచ్చే ఏడాదికి సంక్రాంతికి కానీ, వేసవికి కానీ విడుదల చేయనున్నట్లు సమాచారం.

పింక్ రీమేక్ కు పవన్ కళ్యాణ్ గడ్డం లుక్ తోనే షూట్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే లీకైన పిక్స్ బట్టి, పవన్ బయట రాజకీయ మీటింగ్స్ లో కనిపిస్తున్నదాన్ని బట్టి పవన్ గుబురు గెడ్డంతోనే షూటింగ్ చేసేస్తారని సమాచారం. పింక్ రీమేక్ కు అది చెల్లిపోతుంది. పింక్ హిందీ వెర్షన్ లో అమితాబ్, తమిళ్ వెర్షన్ నెర్కొండ పర్వాయ్ లో అజిత్ గెడ్డంతోనే కనిపించారు కాబట్టి ఓకే అనుకోవచ్చు. అయితే క్రిష్ సినిమాకు కూడా పవన్ ఇదే లుక్ లో కనిపిస్తాడా అనే కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పింక్ రీమేక్, క్రిష్ చిత్ర షూటింగ్స్ సమాంతరంగా వచ్చే నెల నుండి జరుగుతాయి అన్న సమాచారముంది. ఈ నేపథ్యంలో లుక్ మార్చేందుకు స్కోప్ లేదు. మరి పీరియాడిక్ మూవీలో ప్రస్తుతం ఉన్న పవన్ లుక్ సరిపోతుందా? లేక వేరేదేదైనా ప్లాన్ చేస్తున్నారా? క్రిష్ – పవన్ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో తీయనున్నారని సమాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All