
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లోనే సెస్సేషనల్ రికార్డ్ నమోదైంది. వకీల్ సాబ్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..రీసెంట్ గా భీమ్లా నాయక్ తో మాస్ హిట్ కొట్టాడు. దగ్గుబాటి రానా తో కలిసి ఈ సినిమాలో పవన్ నటించాడు. ప్రతీకార కథతో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ చిత్రానికి సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేయగా, సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. థమన్ సంగీతం అందించగా, ఈ సినిమాలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. మొదటి మూడు రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్ల తో రాబట్టగా..ఆ తరువాత రోజు నుండి తగ్గుతూ , పెరుగుతూ వస్తుంది. ఇక పదో రోజు అన్ని చోట్ల హౌస్ ఫుల్ తో నడిచినట్లు తెలుస్తుంది.
ప్రస్తుత సమాచారం మేరకు..10 వ రోజు కలెక్షన్స్ నైజాంలో రూ. 64 లక్షలు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 21 లక్షలు, ఈస్ట్‌లో రూ. 16 లక్షలు, వెస్ట్‌లో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. మొత్తం రూ. 1.90 కోట్లు షేర్, రూ. 3 కోట్లు గ్రాస్ రాబట్టింది. దీంతో మొత్తం పది రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 94.66 కోట్లు షేర్‌తో పాటు రూ. 154 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ గ్రాస్ తో పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఈ మార్కును చేరుకున్న మొట్టమొదటి చిత్రంగా ఇది రికార్డును క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం 94.66 కోట్లు షేర్ తో వంద కోట్ల వైపు పరుగులు పెడుతుంది.