
కశ్మీర్ ఫైల్స్ ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత నెలలో వచ్చిన ఈ మూవీ..చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది. ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 1990లలో జమ్మూకశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని తెరకెక్కిచారు. దీంతో ఈ సినిమాను కేంద్రం మెచ్చడం తో ప్రజలంతా ఈ సినిమాలో ఏముందా అని చూసేందుకు థియేటర్స్ కు పరుగులు పెట్టారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ వస్తుంది. కశ్మీర్ హిందూ పండితుల ఊచకోత నేపథ్యంలోని ఈ సినిమాపై బోలెడన్ని ప్రశంసలు కురిసాయి
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు దర్శకనిర్మాతలు సెలబ్రిటీలు వివేక్ అగ్నిహోత్రి.. అభిషేక్ లను ప్రశంసించారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రశంసా సమావేశంలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతుంది.