
వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్ ..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు చిత్రాన్ని చేస్తున్నాడు. రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీ లో ఈ మూవీ షూటింగ్ పున; ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్..తమిళంలో సూపర్ హిట్ సాదించిన వినోదయ చిత్తమ్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయాలనీ అనుకున్నారు. ఈ మూవీ లో పవన్ తో పాటు మరో హీరోగా సాయి ధరమ్ తేజ్ ను అనుకున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తుండగా, మాటలను సాయి మాధవ్ బుర్రను అనుకున్నారు. ఇక పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తుంది. మే నెలలో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని మొన్నటి వరకు అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ చిత్రం సెట్స్ పైకి రావడానికి టైం పడుతున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమాను వీలయినంత త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఏప్రిల్ నెల అంతా ఆ సినిమాకే కేటాయించారు. అయితే మరోపక్క పొలిటికల్ యాక్టివిటీ పెరుగుతోంది. పార్టీని పటిష్టం చేయడం, తరచు సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు పెరుగుతున్నాయి. పైగా సాయిధరమ్ తేజ్ ఇటీవలే కోలుకొని బయటకు వచ్చారు. ప్రమాదానికి గురయిన తరువాత ఆయన షూటింగ్ చేయడం ఇప్పుడే ప్రారంభించారు. ఆయనను హడావుడి పెట్టి, అలసటకు గురిచేయకూడదని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అందువల్లే వినోదయ చిత్తమ్ చిత్ర రీమేక్ ఆలస్యం అవుతుందని అంటున్నారు.