Homeటాప్ స్టోరీస్భీమ్లా నాయక్ చిత్ర బృందానికి గుర్తుండిపోయే పార్టీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

భీమ్లా నాయక్ చిత్ర బృందానికి గుర్తుండిపోయే పార్టీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan, Trivikram at Bheemla Nayak Success Party
Pawan Kalyan, Trivikram at Bheemla Nayak Success Party

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద చూపించారు. పవన్ కళ్యాణ్ హీరోగా రానా విలన్ రోల్ లో నటించిన భీమ్లా నాయక్ మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ లోని అసలైన మాస్ యాంగిల్స్ ను బయటకు తీయడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుండడం తో చిత్ర యూనిట్ కు పవన్ కళ్యాణ్ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.

నిన్న సాయంత్రం ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ మొత్తానికి పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కలిసి ఓ గ్రాండ్‌ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌, సింగర్స్‌ అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే..

- Advertisement -

రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

* నైజాంలో రూ. 7.48 కోట్లు
* సీడెడ్‌లో రూ. 1.56 కోట్లు
* ఉత్తరాంధ్రలో రూ. 1.29 కోట్లు
* ఈస్ట్‌లో రూ. 74 లక్షలు
* వెస్ట్‌లో రూ. 42 లక్షలు
* గుంటూరులో రూ. 65 లక్షలు
* కృష్ణాలో రూ. 64 లక్షలు
* నెల్లూరులో రూ. 36 లక్షలతో కలిపి రూ. 13.14 కోట్లు షేర్, రూ. 20 కోట్లు గ్రాస్ వచ్చింది

రెండు రోజులకు కలిపి చూస్తే..

* నైజాంలో రూ. 19.33 కోట్లు
* సీడెడ్‌లో రూ. 4.84 కోట్లు
* ఉత్తరాంధ్రలో రూ. 3.17 కోట్లు
* ఈస్ట్‌లో రూ. 2.69 కోట్లు
* వెస్ట్‌లో రూ. 3.44 కోట్లు
* గుంటూరులో రూ. 3.16 కోట్లు
* కృష్ణాలో రూ. 1.53 కోట్లు
* నెల్లూరులో రూ. 1.40 కోట్లతో కలిపి రూ. 39.56 కోట్లు షేర్, రూ. 58 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే..ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ ని ప్రీమియర్స్ తో కలిపి సింగిల్ డే లో ఈ చిత్రం వసూలు చెయ్యగా.. ఈ వీకెండ్ నాటికి 1.5 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసిందట. అలాగే డెఫినెట్ గా భీమ్లా నాయక్ అక్కడ 2 మిలియన్ క్లబ్ లో కూడా చేరుతుంది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ దగ్గర భీమ్లా ఉంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All