
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ షూట్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెలలోనే చిత్ర షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కువ బ్రేక్స్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమాను తిరిగి మొదలుపెడతాడు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు చేస్తోన్న విషయం తెల్సిందే.
ఎనిమిది నెలల క్రితం కరోనా నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో, క్రిష్ కొండపొలం ప్రమోషన్స్ తో బిజీ అయిపోయారు. క్రిష్ ప్రస్తుతం హరిహర వీర మల్లు నెక్స్ట్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్ నుండి ఈ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభం కానుంది. భారీ కాన్వాస్ తో అత్యధిక బడ్జెట్ తో వందల మంది కాస్ట్ అండ్ క్రూ తో ఈ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది.
హరిహర వీర మల్లు ఫస్ట్ హాఫ్ షూటింగ్ దాదాపుగా పూర్తయింది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రాంపాల్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకుంటారు అంటోన్న స్టార్ రైటర్
హరిహర వీర మల్లు షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టిన పవన్
పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యాడుగా!
హరిహర వీరమల్లు … టూ మేజర్ ఈవెంట్స్ కన్ఫర్మ్