
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రెండు సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేసాడు. ఏప్రిల్ లో వకీల్ సాబ్ చిత్రాన్ని విడుదల చేసాడు. ప్రస్తుతం పవన్ రెంచు సినిమాలను చేస్తున్నాడు. ఈ ఏడాది మరో సినిమా విడుదల చేయాల్సి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ ఆ ప్లాన్స్ పై నీళ్లు చల్లింది.
పవన్ కళ్యాణ్ రెండు నెలల క్రితం కరోనా సోకిన విషయం తెల్సిందే. కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్ ఇంకా షూటింగ్ కు రావట్లేదు. త్వరలోనే పవన్ సినిమాల షూటింగ్స్ మొదలవుతాయి. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ ను చేస్తున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లు సినిమాను కూడా చేస్తున్నాడు. త్వరలోనే ఈ రెండు చిత్రాల షూటింగ్స్ మొదలవుతాయి.
సంక్రాంతి 2022లో అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని విడుదల చేస్తారు. 2022 సెకండ్ హాఫ్ లో హరిహర వీర మల్లు విడుదలవుతుంది.