జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో పవన్ ని కేంద్రం టార్గెట్ చేసినట్లు గా ప్రకటించాడు . నా ఇంటికి ఐటీ అధికారులను పంపించి కేంద్ర ప్రభుత్వం తమ చిల్లర బుద్ది ని చాటుకుందని , అలాగే తెలుగుదేశం , జగన్ పార్టీ లు కూడా కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందని భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్ .
మీడియాతో ఈరోజు ఇష్టాగోష్టి గా మాట్లాడిన పవన్ తనని 2014 లో దారుణంగా వాడుకున్నారని అధికారంలోకి వచ్చాక మోసం చేసారని అందుకే 2019 లో నా స్టాండ్ ఏంటి ? అనేది ఇప్పుడే చెప్పనని త్వరలో జరగబోయే జనసేన ప్లీనరీ లో స్పష్టం చేస్తానని అన్నాడు . మాఫియా మాట ఇస్తే దాని మీద నిలబడుతుంది కానీ రాజకీయ నాయకులు మాత్రం మాట మీద నిలబడటం లేదని కుండబద్దలు కొట్టాడు పవన్ కళ్యాణ్ .