
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా మల్టీస్టారర్ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 15న చిత్ర టీజర్ ను టైటిల్ తో పాటు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ఏంటనేది తెలిసిపోయింది.
ఈ సినిమాకు భీమ్లా నాయక్ ను టైటిల్ గా కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భీమ్లా నాయక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పుడు అదే పేరుని సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా రేపు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది.
సాగర్ కె చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని టాక్.