HomeVideosప‌వ‌న్ ఎంట్రీ  అదుర్స్‌..త‌మ‌న్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా!

ప‌వ‌న్ ఎంట్రీ  అదుర్స్‌..త‌మ‌న్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా!

ప‌వ‌న్ ఎంట్రీ  అదుర్స్‌..త‌మ‌న్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా!
ప‌వ‌న్ ఎంట్రీ  అదుర్స్‌..త‌మ‌న్ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదుగా!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా ద‌గ్గుబాటి తొలిసారి క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఈ మండే మొద‌లైన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ చిత్రం ఆధారంగా ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మాట‌ల‌తో పాటు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

అల్యూ మినియం ఫ్యాక్ట‌రీలో ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించారు. అక్క‌డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానాల‌పై పోరాట ఘ‌ట్టాల్ని ఫైట్ మాస్ట‌ర్ దిలీప్ సుబ్బ‌రాయ‌న్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్ లొకేష‌న్ వీడియోని చిత్ర బృందం తాజాగా విడుద‌ల చేసింది. బుల్లెట్‌పై లాడ్జీ వైపు వెళుతున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ విజువ‌ల్స్ బాగున్నాయి. దీనికి త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

ఈ వీడియోకి త‌మ‌న్ అందించిన బీజియ‌మ్స్ విన్న వాళ్లంతా కాస్త త‌మ‌న్‌ని ఆపండ్రా బాబూ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. మ‌రో కీల‌క పాత్ర‌లో రానా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఈ ఇద్ద‌రి పాత్ర‌లు నువ్వా నేనా అనే స్థాయిలో వుండ‌నున్నాయ‌ని తెలిసింది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All