Homeటాప్ స్టోరీస్'99 సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తాను..100 వ సారి మాత్రమే యుద్ధం చేస్తాను' పవన్ తాజా ట్వీట్

’99 సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తాను..100 వ సారి మాత్రమే యుద్ధం చేస్తాను’ పవన్ తాజా ట్వీట్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇటు సినిమాలతోను, అటు రాజకీయాలతోను బిజీ గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే కసి తో ఉన్నాడు. అందుకే ప్రస్తుతం ఒప్పుకున్నా సినిమాలను త్వరగా పూర్తి చేసి ..వచ్చే ఏడాది నుండి రాజకీయాల్లో బిజీ కావాలని భావిస్తున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. ఏపీ మినహా అన్ని చోట్ల రికార్డు కలెక్షన్ల తో మోతమోగిస్తుంది. ఏపీలో మాత్రం తక్కువ కలెక్షన్లు రావడానికి కారణం ఏపీ సర్కార్ విధించిన రూ. 5 , రూ. 10 టికెట్ ధరలు. భీమ్లా నాయక్ రిలీజ్ ముందు చిత్రసీమ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ ను కలిసి జీవో 35 ని రద్దు చేయాలనీ , టికెట్ ధరలు పెంచాలని , అదనపు షోస్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో ప్రభుత్వం సైతం సరే అని మాట ఇచ్చింది.

కానీ ఆ మాట ను మాత్రం నెరవేర్చలేదు. భీమ్లా నాయక్ కు పాత ధరలే పెట్టి అక్కడి డిస్టిబ్యూటర్స్ కు నష్టం వచ్చేలా చేసారు. భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో ఏపీలో అభిమానులకు , సర్కార్ కు పెద్ద యుద్ధమే నడిచింది. కానీ పవన్ మాత్రం నోరు విప్పలేదు. తాజాగా తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ‘ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై తొమ్మిది సార్లు శాంతియుతంగా ప్రయత్నిస్తాను, నూరనసారి మాత్రమే యుద్ధం చేస్తాను’ అన్న కొటేషన్ తో ఓ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక పవన్ ఎక్కువగా పుస్తకాలు చదువుతూంటాడనే సంగతి తెలిసిందే. గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాలు ఎక్కువగా చదువుతూ..వాటినే ఫాలో అవుతుంటాడు. ఇక ఇప్పుడు పెట్టిన పోస్ట్ కు కూడా చాల అర్ధమే ఉందని అర్ధమవుతుంది.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All