
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ చమటలుపట్టిస్తోంది. ఎప్పుడు ఎవరు ఐసోలేషన్‌లోకి వెళ్లాల్సి వస్తుందో.. ఎవరు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సి వస్తుందో తెలియడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే సెకండ్ వేవ్ లోనే చాలా మంది సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిలీలు ఈ దఫా ఎక్కువ మంది కోవిడ్ బారిన పడుతుండగం కలవరాన్ని కలిగిస్తోంది.
తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు అల్లు అరవింద్, విజయేంద్ర ప్రసాద్, నివేదా థామస్.. ఇలా వరుసగా కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా పవన్‌కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందితో పాటు ఆయనకు అత్యంత సన్నిహితంగా వుండే పొలిటికల్ వింగ్ కూడా కోవిడ్ బారిన పడినట్టు తెలిసింది. దీంతో ముందు జాగ్రత్తగా హీరో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు.
తన భార్య, పిల్లలతో కలిసి ఆయన నగర శివారులోని శంకర్‌పల్లిలో గత తన ఫామ్ హౌస్‌లోకి వెళ్లిపోయారు. అక్కడే ప్రస్తుంత వుంటున్నారు. 7 రోజులు అక్కడ గడిపిన తరువాత ఎలాంటి సింప్టోమ్స్ తేలని పక్షంలో పవన్ మళ్లీ తిరిగి సిటీలోకి ఎంటరవుతారట. పవర్‌స్టార్ మూడేళ్ల విరామం తరువాత చేసిన `వకల్‌సాబ్` ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ని సొంఒతం చేసుకున్న విషయం తెలిసిందే.