
వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హరిహర వీరమల్లు ఫై ఫోకస్ పెట్టాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాల నెలలే అవుతున్నప్పటికీ మధ్యలో రీమేక్ చిత్రాలు రావడం తో ఈ సినిమాలు ఆలా ఆపేసారు. ప్రస్తుతం దీనిని పూర్తి చేసి , ఆ తర్వాత తమిళంలో సముద్రఖని నటించిన రూపొందించిన `వినోధాయ సితం` చిత్రం రీమేక్ లో నటించాలని పవన్ చూస్తున్నాడట.
అయితే ఇలా ఈ రెండు సినిమాలపై దృష్టి సారించిన పవన్..హరీష్ శంకర్ డైరెక్షన్లో చేద్దామనుకున్న భవదీయుడు భగత్ సింగ్ ను వచ్చే ఏడాదిలో స్టార్ట్ చేయాలనీ అనుకుంటున్నాడట. మరి వచ్చే ఏడాదైనా వర్క్ అవుట్ అవుతుందో లేదో చెప్పాలేమో..ఎందుకంటే ఏపీలో ముందస్తు ఎన్నికల వార్తలు జోరు అనుకున్నాయి. ఒకవేళ నిజంగానే ఎన్నికలు వస్తే పవన్ సినిమాలు ఆపేయడం ఖాయం..సో హరీష్ శంకర్ సినిమా ఏంచేస్థాడో అని మేకర్స్ ఖంగారు పడుతున్నారు.