Homeటాప్ స్టోరీస్వీరమల్లు - ఆ విషయంలో మాత్రం వండర్ క్రియేట్ చేస్తుందిట

వీరమల్లు – ఆ విషయంలో మాత్రం వండర్ క్రియేట్ చేస్తుందిట

వీరమల్లు - ఆ విషయంలో మాత్రం వండర్ క్రియేట్ చేస్తుందిట
వీరమల్లు – ఆ విషయంలో మాత్రం వండర్ క్రియేట్ చేస్తుందిట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఒక పీరియాడిక్ డ్రామా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా కారణంగా బ్రేకులు పడ్డ విషయం తెల్సిందే. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఒక బందిపోటుగా కనిపించబోతున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లు ప్రధానంగా ఉండే ఈ చిత్రంలో మరో కీలకమైన అంశం గ్రాఫిక్స్ అంటున్నారు.

విజువల్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టన్నింగ్ గా ఉంటాయట. ఈ విషయంలో మాత్రం క్రిష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రాంపాల్ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

ఎం ఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు కానీ అది జరిగేలా కనిపించడం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All