Homeగాసిప్స్మహేష్ రూట్లోనే పవన్ కూడా ఫ్లాటైపోతాడా?

మహేష్ రూట్లోనే పవన్ కూడా ఫ్లాటైపోతాడా?

మహేష్ రూట్లోనే పవన్ కూడా ఫ్లాటైపోతాడా?
మహేష్ రూట్లోనే పవన్ కూడా ఫ్లాటైపోతాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వ్యక్తులతో ఎక్కువగా రిలేషన్ మైంటైన్ చేయడు. ఏదైనా సినిమా చేస్తున్నాడంటే వాళ్లతో క్లోజ్ గా ఉంటాడు. ఆ దర్శకుడితో ట్రావెల్ చేస్తాడు. తర్వాత డిస్ కనెక్ట్ అయిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ సినిమా వాళ్లతో ట్రావెల్ చేస్తాడు. అయితే మహేష్ బాబు ఈ మధ్య కాలంలో అమితంగా ఇష్టపడిన నిర్మాతలలో దిల్ రాజు పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దిల్ రాజు మానేజ్మెంట్ కు, సినిమా తీసే విధానానికి, రిలీజ్ పద్ధతులకు ఫ్లాట్ అయిపోయిన మహేష్, తన సినిమాల నిర్మాణంలో దిల్ రాజునూ ఎలాగోలా భాగం చేయాలని చూస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత మహేష్ దిల్ రాజు కలిసి మహర్షి సినిమాకు పని చేసారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కూడా దిల్ రాజు భాగస్వామిగా చేరడంటే దానికి ప్రధాన కారణం మహేష్.

తన నెక్స్ట్ సినిమా కూడా దిల్ రాజుకే చేస్తున్నాడు మహేష్. మరో హ్యాట్రిక్ మీతో కొట్టాలని ఉందని స్టేజ్ పైనే చెప్పేసాడు సూపర్ స్టార్. అంతలా ఈ బడా నిర్మాతకు ఫ్లాటైపోయాడు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దిల్ రాజు బుట్టలో పడ్డాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీకి అంత సముఖంగా లేని తరుణంలో కూడా కాదనలేని ఆఫర్లు ఇచ్చి రీ ఎంట్రీకి ఒప్పించాడు.

- Advertisement -

పవన్ కు సమయం కుదిరినప్పుడు షూట్ లో పాల్గొనేలా మ్యానేజ్ చేస్తున్నాడు దిల్ రాజు. దానికి తోడు సినిమా షూటింగ్ శరవేగంగా సాగిపోయేలా చూస్తున్నాడు. పవన్ పార్ట్ ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని తన టీమ్ కు సూచనలు చేసాడు. పవన్ రాజకీయాలకు కూడా సమయం కుదిరేలా ఛార్టర్డ్ ఫ్లయిట్ కు కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తనను ఇంత బాగా చూసుకుంటోన్న దిల్ రాజుకు పవన్ నచ్చకుండా ఎలా ఉంటాడు. త్వరలోనే తనతో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All