
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన చిత్రం `వకీల్ సాబ్`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ రీ ఎంట్రీ ఫిల్హ్‌గా భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీరి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలని ప్రారంభించింది. మ్యూజిక్ ఫెస్ట్ పేరుతో ప్రమోషన్స్ మోతెక్కిస్తున్నారు. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్పీడందుకున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని ఇటీవలే ప్రారంభించారు. ఈ రోజు తో పవన్‌కు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీమ్ కొన్ని ఫొటోలని రిలీజ్ చేసి డబ్బింగ్ పూర్తియిందని వెల్లడించింది.
ఇదిలా వుంటే ఈ నెల 29న పవన్ అభిమానులకు `వకీల్ సాబ్` టీమ్ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌ని అందించబోతోంది. ఈ రోజు `వకీల్ సాబ్` ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ నెల 29 నుంచే పవన్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకబోతున్నాయి. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్‌గా ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
It’s a wrap for dubbing ????????
???? @PawanKalyan #SriramVenu @shrutihaasan @SVC_official @i_nivethathomas @yoursanjali @musicthaman @AnanyaNagalla @bayviewprojoffl @BoneyKapoor @adityamusic
#VakeelSaabOnApril9th???????? pic.twitter.com/N7WeRthwlO— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2021