Homeటాప్ స్టోరీస్రంగస్థలం సక్సెస్ మీట్ కు పవన్

రంగస్థలం సక్సెస్ మీట్ కు పవన్

pawan kalyan chief guest for rangasthalam success meetపవన్ కళ్యాణ్ గతకొంత కాలంగా చిరంజీవి కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే , అయితే ఈమధ్య మాత్రం కొంత టచ్ లో ఉంటున్నాడు . ఆమధ్య అన్నయ్య చిరు రీ ఎంట్రీ తో అదరగొట్టాడని పవన్ అన్నయ్య ఇంటికి వెళ్లిన విషయం కూడా విదితమే . అయితే మిగతా హీరోల ఫంక్షన్ లకు వెళ్తున్న పవన్ మెగా కుటుంబంలో మాత్రం ఏ హీరో దైనా ఫంక్షన్ జరిగితే మాత్రం వెళ్లడం మానేసాడు . దాంతో ఇంకా మెగా కుటుంబంలో గొడవలు సద్దుమణగలేదు అని అనుకున్నారు దానికి తోడు జనసేన పార్టీ కి చిరు కి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పఁడంతో నిజమే అనుకున్నారు .

కట్ చేస్తే 2019 లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్నయ్య కు మరింత దగ్గర అవుతున్నాడు పవన్ . నిన్నటికి నిన్న రంగస్థలం చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూసాడు పవన్ అంతేకాదు రంగస్థలం సక్సెస్ మీట్ లో చరణ్ నటన గురించి మాట్లాడతానని మీడియా ముందు చెప్పాడంటే అన్నయ్య కుటుంబంతో పవన్ కి సఖ్యత కుదిరినట్లే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All