Homeన్యూస్తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జనసేనాని పుట్టిన రోజు వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జనసేనాని పుట్టిన రోజు వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జనసేనాని పుట్టిన రోజు వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జనసేనాని పుట్టిన రోజు వేడుకలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. రెండు రోజుల ముందుగానే పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రెషన్స్ సందడి మొదలైంది. ఇప్పటికే ఫ్యాన్స్ కోసం పవర్ స్టార్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్స్ తమ్ముడు, జల్సా చిత్రాలు థియేటర్లలో రిలీజ్ చేశారు మేకర్స్. భారీ కటౌట్స్.. పాలాభిషేకాలతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు.

తాజాగా పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా హరి హరి వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. కాసేపటి క్రితం డైరెక్టర్ క్రిష్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో మెడల్ని వంచి, కథల్ని మార్చి..కొలిక్కితెచ్చే పనెట్టుకొని .. తొడకొట్టాడో.. తెలుగోడు అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోగా.. విలన్స్‏ను వేటాడుతూ పవర్ ఫుల్ లుక్ లో కనిపించారు పవన్. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఎ.ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నిధీ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -

వచ్చే ఏడాదిలో వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమాను మొదలుపెట్టి చాలా కాలమైనప్పటికీ కూడా అనుకొని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ మధ్యలో వాయిదా పడుతూ వస్తోంది. ఇక మొత్తానికి ఇటీవల చిత్ర యూనిట్ మళ్ళీ ఈ సినిమా పనుల్ని మొదలుపెట్టి మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All