
జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. పవన్ కళ్యాణ్ మత్య్సకారులు కోసం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం నరసాపురం లో ఏర్పటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్య లో అభిమానులు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహానికి పవన్ కళ్యాణ్ కింద పడిపోయారు. ర్యాలీలో కారుపై నిలుచుని అభివాదం చేస్తున్న సమయంలో ఓ అభిమాని ఒక్కసారిగా కారుపైకి దూసుకొచ్చారు. ఈ సమయంలో అభిమాని పవన్ ను నెట్టడంతో కారుపైనే కూర్చుండి పోయారు. దీంతో ప్రమాదం తప్పింది. దీంతో రోడ్ షోలో ఒక్కసారిలో కలకలం రేగింది. అయితే, కింద పడ్డ పవన్ కళ్యాణ్ నవ్వుతూ పైకి లేచి, తిరిగి అభిమానులకు అభివాదం చేశారు.
ఇక సభలో పవన్ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కులాలను విడగొట్టి పాలించే విధాన్ని మార్చుకుని.. కులాలను కలుపుతూ వెళ్లే విధానాన్ని పాటించాలని కోరారు. తనను ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుందని.. తాను అలా ఒక కులాన్ని మోసే వ్యక్తిని అయితే.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయనని చెప్పారు.
తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లను చూశాం.. జగన్ మోహన్ రెడ్డి పార్టీని కూడా గత కొంతకాలంగా చూశాము.. ఇప్పుడు సరికొత్త పార్టీ విధాన్ని చూడాలని కోరారు. మత్య్సకారులు వేటకు వెళ్లే సమయంలో అండగా ఉండే పరిస్థితులు కావాలని సూచించారు. ఉత్తరాంధ్ర నుంచి ఎక్కడికి వెళ్లినా అందరు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని.. వారికీ ఉద్యోగ కల్పన చేయాలనీ కోరారు. జనసేన మానిఫెస్టోని రేపు రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు.