Monday, September 26, 2022
Homeటాప్ స్టోరీస్పార్వ‌తీశం - శ్రీ‌ల‌క్ష్మీ జంట‌గా `సావిత్రి W/O స‌త్య‌మూర్తి` షురూ !

పార్వ‌తీశం – శ్రీ‌ల‌క్ష్మీ జంట‌గా `సావిత్రి W/O స‌త్య‌మూర్తి` షురూ !

పార్వ‌తీశం - శ్రీ‌ల‌క్ష్మీ జంట‌గా `సావిత్రి W/O స‌త్య‌మూర్తి` షురూ !
పార్వ‌తీశం – శ్రీ‌ల‌క్ష్మీ జంట‌గా `సావిత్రి W/O స‌త్య‌మూర్తి` షురూ !

`కేరింత ఫేమ్ పార్వ‌తీశం హీరోగా న‌టిస్తున్న చిత్రం `సావిత్రి W/O స‌త్య‌మూర్తి`. ఏ1 మ‌హేంద్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గోగుల న‌రేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో పనిచేసిన చైత‌న్య కొంత ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో హీరో పార్వ‌తీశం భార్య‌గా సీనియ‌ర్ న‌టి శ్రీ‌ల‌క్ష్మీ న‌టిస్తోంది. 60 ఏళ్ల ఆమెకు, 25 ఏళ్ల కుర్రాడు భ‌ర్త ఎలా అయ్యాడ‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన కథాంశం.

- Advertisement -

బుధ‌వారం ఈ చిత్రం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఇదే రోజు నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొదలైంది. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ క్లాప్ నిచ్చారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `పాతికేళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య‌. వాళ్లిద్ద‌రూ భార్యా భ‌ర్త‌లు ఎలా అయ్యారు? అన్న‌దే ఇందులో ఆస‌క్తిక‌రం. పార్వ‌తీశానికి త‌న‌యులుగా శివారెడ్డి, సునీల్‌శెట్టి, త‌మ్ముడిగా జెన్నీ న‌టిస్తున్నారు` అని తెలిపారు.

నిర్మాత గోగుల న‌రేంద్ర మాట్లాడుతూ `మంచి వినోదాత్మ‌క చిత్ర‌మిది. ఆద్యంతం ప్రేక్ష‌కులు న‌వ్వుకునేలా ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. హైద‌రాబాద్‌లో 25 రోజులు,  అవుట్ డోర్‌లో 20 రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం. 45 రోజుల్లో సినిమా మొత్తం పూర్తి చేస్తాం` అన్నారు. ఇంత వ‌ర‌కు నేను ఇలాంటి పాత్ర చేయ‌లేదు. నాకు కుమారుడుగా న‌టించాల్సిన పార్వ‌తీశం భ‌ర్త‌గా న‌టిస్తున్నారు. యూత్ మొగుడు. వింటుంటే నాకే న‌వ్వొస్తోంది` అని శ్రీ‌ల‌క్ష్మీ తెలిపారు. `కేరింత`‌కు మించిన పేరు తెచ్చి‌పెట్టే చిత్ర‌మిద‌ని పార్వ‌తీశం అన్నారు. ఆషీ, గీత్ షా, ముస్కాన్ అరోరా హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts