Homeటాప్ స్టోరీస్చైతు తో సర్కారు వారి డైరెక్టర్

చైతు తో సర్కారు వారి డైరెక్టర్

parushuram next movie
parushuram next movie

గీత గోవిందం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరుశురాం చాల గ్యాప్ తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట మూవీ చేసాడు. మే 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు , టీజర్ , స్టిల్స్ సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. ఇక ఈ మూవీ తర్వాత ఏ హీరో తో పరుశురాం సినిమా చేస్తాడని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే పరుశురాం నెక్స్ట్ నాగ చైతన్య తో సినిమా చేయనున్నాడు.

నిజానికి ఈ ప్రాజెక్ట్ చాలా కాలం కిందటిదే. చైతూ-పరుశురామ్ కలిసి సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అది అలా వాయిదా పడుతూ వచ్చింది. ఈ లోగా మహేష్ తో సినిమా ఫిక్స్ అయింది. అందుకే ఈ సినిమా తరువాత చైతన్యతో సినిమా వుంటుందని తెలుస్తోంది. 14 రీల్స్ బ్యానర్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఇది కూడా గతంలో ఫిక్స్ అయినదే. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా నిర్మాణంలో కూడా 14 రీల్స్ భాగస్వామిగా వుంది. పరుశురామ్ తరువాత సినిమా పూర్తిగా ఆ బ్యానర్ నే నిర్మిస్తుంది. ఇక చైతు కూడా ప్రస్తుతం సినిమాలు , వెబ్ సిరీస్ తో బిజీ గా ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All