
కొంత విరామం తరువాత `గీత గోవిందం` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు యువ దర్శకుడు పరశురామ్. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. సైలెంట్‌గా వచ్చిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.
ఈ సినిమా తరువాత స్టార్ హీరొతో సినిమా చేయాలని ప్రయత్నించారు పరశురామ్ కానీ కుదరలేదు. నాగచైతన్యతో సినిమా ఫిక్సయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు చిత్ర బృందం ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటన కూడా విడుదల చేసింది. విభిన్నమైన కథా, కథనాలతో సాగే ఈ చిత్రానికి `నాగేశ్వరరావు` అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు.
అయితే అనూహ్యంగా కొరటాల శివ కారణంగా మహేష్‌కు కథ చెప్పే అవకాశం పరశురాంకు దక్కింది. దీంతో అక్కడ ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. దీంతో నాగచైతన్య ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనని ప్రాచరం మొదలైంది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, నాగచైతన్యతో సినిమా ఆగిపోలేదని, చై కెరీర్‌లో `నాగేశ్వరరావు` చిత్రం మెమరబుల్ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని పరశురామ్ క్లారిటీ ఇచ్చారు.