Homeఎక్స్ క్లూసివ్ఫిబ్రవరి 9న "పలాస 1978" చిత్రీకరణ ప్రారంభం

ఫిబ్రవరి 9న “పలాస 1978” చిత్రీకరణ ప్రారంభం

 Palasa 1978 will be start on February 9th
Rakshith and Nakshatra

“లండన్ బాబులు”  ఫేం రక్షిత్ హీరొగా , నక్షత్ర ను హీరొయిన్ గా పరిచయం చెస్తూ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతొన్న చిత్రం “పలాస 1978” . కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లన , అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా “పలాస 1978” చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఎన్నో చిత్రాలకు  రచన, దర్శకత్వ విభాగంలో వర్క్ చెసిన నేను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నానన్నారు.

- Advertisement -

నిర్మాతలు మాట్లాడుతూ : ఫిబ్రవరి 9 న చిత్రీకరణ ప్రారంభిస్తాము.పూర్తిగా  ఆంధ్రా ప్రదేశ్ లొనె చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న తొలిచిత్రమిది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్వహరిస్తున్నారు. బెస్ట్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. రియలిస్టిక్ మూవీగా ఈ చిత్రముంటుందని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె, సాహిత్యం: భాస్కరభట్ల, లక్ష్మి భూపాల్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ సుంకర, నిర్మాతలు: అప్పారావు బెల్లన, అట్లూరి వరప్రసాద్, దర్శకత్వం: కరుణ  కుమార్.

 

English Title: Palasa 1978 will be start on February 9th

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All